Sunney: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మలయాళ చిత్రంలో సన్నీ లియోన్ 
  • 'మనం' దర్శకుడి చిత్రంలో నాని 
  • మహేశ్, సుకుమార్ చిత్రం అప్ డేట్ 
  • 'సైరా' తదుపరి షెడ్యూలుకి ఏర్పాట్లు  

*  బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాలలో నటించింది. ఇప్పుడు మలయాళంలో కూడా నటించడానికి రెడీ అవుతోంది. సంతోష్ నాయర్ దర్శకత్వంలో రూపొందే 'రంగీల' చిత్రంలో సన్నీ నాయికగా నటించనుంది.
*  'మనం' ఫేం విక్రం కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందుకు సంబంధించిన కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తను చేస్తున్న 'జెర్సీ' చిత్రం తర్వాత నాని ఈ చిత్రం షూటింగులో పాల్గొంటాడు.
*  మహేశ్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాగా, ఇందులో హీరోయిన్ గా కైరా అద్వానీ కానీ, రష్మిక మందన కానీ నటించే ఛాన్స్ వుందని సమాచారం.
*  చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాదులో జరిగే ఈ షెడ్యూలులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. రెండు వారాల క్రితం పూర్తయిన జార్జియా షెడ్యూలులో యుద్ధ సన్నివేశాలను భారీ ఎత్తున చిత్రీకరించారు.  

  • Loading...

More Telugu News