Jagan: జగన్ ను పోలీసు అధికారులు మరోసారి కలుస్తారు: ఏపీ డీజీపీ

  • విచారణకు సహకరించాలని ఇప్పటికే రెండుసార్లు జగన్ ను విచారణ అధికారులు కోరారు
  • జగన్ పాదయాత్రకు భద్రత పెంచుతాం
  • జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి నాకు నోటీసులు రాలేదు

విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ ను విచారణ అధికారులు రెండు సార్లు కలిశారని... విచారణకు సహకరించాలని కోరారని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. జగన్ ను మరోసారి అధికారులు కలుస్తారని చెప్పారు.

అలాగే జగన్ పాదయాత్రకు భద్రతను మరింత పెంచుతామని తెలిపారు. నాయకులకే కాకుండా, రాష్ట్రంలోని ప్రజలందరికీ భద్రతను కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని మరోసారి కస్టడీలోకి తీసుకోవడం అన్నది విచారణ అధికారుల నిర్ణయమని అన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి తనకు నోటీసులు అందాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు.

Jagan
YSRCP
stab
ap dgp
  • Loading...

More Telugu News