Telangana: తెలంగాణలో మొగ్గు మహాకూటమివైపే: రిపబ్లిక్, సీ-వోటర్ సర్వే!

  • మహాకూటమికి 8 స్థానాలు
  • 7 స్థానాలు టీఆర్ఎస్ కు
  • ఉనికిని కాపాడుకోనున్న మజ్లిస్

తెలంగాణలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి వైపే మొగ్గు ఉందని, టీఆర్ఎస్ కన్నా కూటమికి అధిక స్థానాలు వస్తాయని రిపబ్లిక్, సీ-వోటర్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలుండగా, మహాకూటమికి 8, టీఆర్ఎస్ కు 7, ఏఐఎంఐఎంకు ఒక్క స్థానం లభిస్తుందని అంచనా వేసింది.

ఇదే సమయంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొంత భిన్నంగా ఉండవచ్చని కూడా పేర్కొంది. మహాకూటమికి 32.2 శాతం ఓట్లు, టీఆర్ఎస్ కు 30.4 శాతం ఓట్లు, బీజేపీకి 19 శాతం ఓట్లు, ఏఐఎంఐఎం కు 3.9 శాతం ఓట్లు లభిస్తాయని రిపబ్లిక్, సీ-వోటర్ సర్వే తెలిపింది.

Telangana
Lok Sabha
AIMIM
Elections
Maha Kutami
  • Loading...

More Telugu News