Chintamaneni: చింతమనేనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయండి: జర్నలిస్టుల ఫిర్యాదు

  • ఏలూరు త్రిటౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు
  • అసభ్య పదజాలంతో దూషించారు
  • ఎస్పీ ఈశ్వరరావుకు వినతిపత్రం అందజేత

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అసభ్య పదజాలంతో దూషించి దౌర్జన్యానికి పాల్పడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు చేయాలని ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో వీడియో జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ఏలూరులోని విజిలెన్స్ కార్యాలయం వద్ద విధి నిర్వహణలో ఉన్న తమను ఎమ్మెల్యే ప్రభాకర్ అకారణంగా అసభ్య పదజాలంతో దూషించారని, కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఈ విషయమై ఎస్పీ ఈశ్వరరావును కలిసి ఓ వినతిపత్రం సమర్పించారు.

ఇదిలావుండగా అక్రమంగా ఇసుక తవ్వుతుండడంతో చింతమనేని అనుచరుల వాహనాలను రెండు రోజుల క్రితం విజిలెన్స్‌ అధికారులు సంఘటనా స్థలంలోనే సీజ్‌ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే ప్రభాకర్, సుమారు 100 మంది ఆయన అనుచరులు సీజ్ చేసిన వాహనాలను దౌర్జన్యంగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులకు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. 

Chintamaneni
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News