Andhra Pradesh: అమరావతిలో శిలాఫలకాన్ని ఇంగ్లిష్ లో వేసినప్పుడే తెలుగువారి ఆత్మగౌరవం పోయింది!: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

  • ఆత్మగౌరవం అంటే అర్థం మారిపోయింది
  • అధికారమే పరమావధిగా మారింది
  • కాంగ్రెస్ వాళ్లు వస్తే లేచి వెళ్లిపొమ్మని ఎన్టీఆర్ చెప్పారు.

ఆంధ్రుల రాజధాని అమరావతిలో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఇంగ్లీషులో వేసుకున్నప్పుడే తెలుగువారి ఆత్మగౌరవం పోయిందని టీడీపీ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాలంలో ఆత్మగౌరవం అంటే అర్థం మారిపోయిందన్నారు.

‘కాంగ్రెస్ వాళ్లు మీ పక్కన కూర్చుంటే లేచి వెళ్లిపోండి’ అని అప్పట్లో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చెప్పేవారని వెల్లడించారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు నేతలకు ఆత్మగౌరవం అంటే అధికారమేనని, అందుకోసమే వాళ్లు పాకులాడుతున్నారని దుయ్యబట్టారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
NTR
self respect
Congress
yarlagadda lakshmi prasad
amaravati
  • Loading...

More Telugu News