nakka anandababu: మార్పు కోసమే చంద్రబాబు జాతీయ పార్టీలను ఏకం చేస్తున్నారు: నక్కా ఆనందబాబు

  • దేశ ప్రయోజనాలే టీడీపీకి ముఖ్యం
  • శిఖండి లాంటి జీవీఎల్‌వి అర్థంలేని ఆరోపణలు
  • చేతనైతే బీజేపీ, జగన్‌, పవన్‌ ఏకమై పోటీ చేయాలి

విపక్షాలపై మంత్రి నక్కా ఆనందబాబు ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్ష పార్టీలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని కొట్టి పారేశారు. ‘మార్పు’ కోసమే చంద్రబాబు భావసారూప్యత ఉన్న జాతీయ పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే టీడీపీ పనిచేస్తుందని తెలిపారు. ‘దేశంలోని వ్యవస్థలన్నింటినీ ప్రధాని మోదీ భ్రష్టు పట్టించారు. వ్యవస్థలో మార్పు అనివార్యం’ అని ఆయన వ్యాఖ్యానించారు. జీవీఎల్‌ వంటి శిఖండితో ఆరోపణలు చేయించడం మానేయాలన్నారు. దమ్ముంటే బీజేపీ, జగన్‌, పవన్‌ కల్యాణ్‌లు కలిసి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు.

nakka anandababu
fires on BJP
  • Loading...

More Telugu News