Pranay: నువ్వు పనికిరాని వాడివి... ప్రణయ్ ని ఏమనకు... సోషల్ మీడియాలో ప్రశాంత్, పావని కాల్ రికార్డు!

  • వైరల్ అవుతున్న ప్రశాంత్, పావని సంభాషణ
  • ప్రణయ్ ని వదిలేయాలని వేడుకున్న ప్రశాంత్
  • ససేమిరా వినని పావని

హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న టెక్కీ తిరునగరి ప్రశాంత్ కేసులో ఆయన భార్య పావనిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి, ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేయగా, వారిద్దరి మధ్య జరిగిన ఓ ఫోన్ కాల్ రికార్డు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ సంచలనం సృష్టిస్తోంది. పెళ్లయిన కొద్ది రోజులకే తన భార్య పావని, ప్రణయ్ అనే మరో యువకుడితో సంబంధం పెట్టుకోగా, వారిద్దరినీ విడదీయాలన్న తన ప్రయత్నాలు విఫలం కావడంతోనే ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తేల్చారు.

ఇక ఈ ఆడియోలో, ప్రణయ్ ని వదిలేయాలని ప్రశాంత్, పావనిని వేడుకుంటున్నట్టు వినిపిస్తోంది. మంచిగా చూసుకుంటానని ప్రశాంత్ చెబుతుంటే, నువ్వు పనికిరానివాడివని, తనను సరిగ్గా చూసుకోలేదని, నీతో కలిసుండాలని లేదని, డిస్టర్బ్ చేయవద్దని పావని అంటోంది. ప్రణయ్ ని ఏమీ అనవద్దని, జరిగిన దానికి నీదే బాధ్యతని ఆగ్రహంతో చెప్పింది. నువ్వు లేకుంటే చనిపోతానని ప్రశాంత్ చెప్పినా, పావని పట్టించుకోకుండా, నీపై నాకు ఇష్టం లేదని చెప్పింది. వైరల్ అవుతున్న ఆ ఆడియోను మీరూ వినవచ్చు.

Pranay
Prashant
Pavani
Sucide
Viral Audio
Social Media
  • Error fetching data: Network response was not ok

More Telugu News