porn sites: 827 పోర్న్ సైట్లను నిషేధించిన ప్రభుత్వం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్‌లో ఉద్యమం!

  • పోర్న్‌సైట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం
  • ఓపెన్ కాని సైట్లు.. వినియోగదారుల బేజారు
  • తమను బలిపశువును చేశారన్న పోర్న్‌హబ్ వైస్ ప్రెసిడెంట్

పోర్న్ సైట్లపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం ఇప్పటి వరకు 827 సైట్లను నిషేధించింది. వీటిని ఓపెన్ చేస్తున్న వేలాదిమంది మొబైల్ యూజర్లకు చేదు అనుభవం ఎదురవుతోంది. నెట్ న్యూట్రాలిటీ చట్టం ప్రకారం వీటిని నిషేధించినట్టు స్క్రీన్‌పై కనిపిస్తుండడంతో వినియోగదారులు తెల్లమొహం వేస్తున్నారు. ముఖ్యంగా వార్షిక సబ్‌స్క్రిప్షన్ చేసుకున్న వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోర్న్ హబ్‌ను వీక్షిస్తున్న వారిలో ప్రపంచంలో భారతీయులది మూడో స్థానం. తొలి రెండు స్థానాల్లో అమెరికా, ఇంగ్లండ్ ఉన్నాయి.

ప్రభుత్వం నిషేధించిన వాటిలో ‘పోర్న్‌హబ్ డాట్ నెట్’, ‘బీహెన్స్ డాట్ నెట్’ వంటి సైట్లు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన మొబైల్ యాప్‌లు కూడా ఉన్నాయి. తమ మొబైళ్లలో ఇవి ఓపెన్ కాకపోవడంతో ఎయిర్‌టెల్, రియలన్స్ జియో, వొడాఫోన్ వినియోగదారులు వేలాదిమంది కస్టమర్ కేర్లకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు.

#pornban పేరుతో వేలాదిమంది  బ్యాన్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. దేశంలోని నెట్ న్యూట్రాలిటీకి ఇది పూర్తిగా వ్యతిరేకమని వాదిస్తున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ, రేప్ పోర్న్, బాండేజ్, డిసిప్లిన్, శాడిజమ్, మాసోచిమ్ టైప్స్ ఆఫ్ సెక్సువల్ ప్రాక్టీస్ (బీడీఎస్ఎం)లపై కఠిన చర్యలు తీసుకోవాలి కానీ, పోర్న్‌హబ్, ఎక్స్ వీడియోస్ డాట్‌కామ్ వంటి వాటిపై నిషేధం విధించడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోర్న్‌హబ్ నిషేధంపై  ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కోరీ ప్రైస్ మాట్లాడుతూ ప్రభుత్వం పెద్ద సైట్లను మాత్రమే నిషేధించిందని, ప్రమాదకరమైన వేలాది సైట్లు, ఇల్లీగల్  కంటెంట్ ఉన్న సైట్లను మాత్రం అలాగే వదిలేసిందని ఆరోపించారు. పోర్నోగ్రఫీపైనా, ‘పెద్దల కంటెంట్’ను వ్యక్తిగతంగా వీక్షించడంపైనా భారత్‌లో ఎటువంటి చట్టం లేదని పేర్కొన్నారు. తమ సైట్లను బలిపశువును చేశారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News