Upendra Kusahwa: సీఎం పదవిని వీడనున్న నితీశ్ కుమార్... సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశాహ్వా

  • ముఖ్యమంత్రిగా పూర్తి సంతృప్తిని పొందారు
  • త్వరలోనే సీఎం పదవి ఖాళీ కానుంది
  • తానేమీ నితీశ్ రాజీనామాను కోరడం లేదన్న కుశాహ్వా

బీహార్ లోని టాప్ పోస్టు త్వరలోనే ఖాళీ కానుందని కేంద్ర మంత్రి, ఉపేంద్ర కుశాహ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామా చేయనున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఆయన ఇప్పటికే పూర్తి సంతృప్తిని పొందారని చెప్పిన ఉపేంద్ర, తానేమీ నితీశ్ రాజీనామాను కోరుకోవడం లేదని, ఆయన్ను తొలగించే శక్తి కూడా ఎవరికీ లేదని అన్నారు.

ఆయనంతట ఆయనగానే సీఎం పదవిని వీడే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. పట్నాలో జరిగిన ఆర్ఎస్ఎల్పీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఆయన, ఇప్పుడు మరో వ్యాపకం కోసం చూస్తున్నారని అన్నారు. కాగా, కుశాహ్వా చేసిన కామెంట్లపై నితీశ్ కుమార్ గానీ, ఆయన పార్టీ నేతలుగానీ ఇంకా స్పందించలేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో జేడీ-యూతో పాటు ఆర్ఎస్ఎల్పీ భాగస్వామిగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

Upendra Kusahwa
Nitish Kumar
Bihar
  • Loading...

More Telugu News