LPG Cylinder: సామాన్యుడికి మళ్లీ భారం.. సిలిండర్‌పై రూ.2.94 వడ్డన

  • సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.60 పెంపు
  • బుధవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి
  •  గత ఆరు నెలల్లో రూ.14.15 పెంపు

ఈ ఏడాది జూన్ నుంచి సబ్సిడీ వంట గ్యాస్ ధరలను ప్రతినెల పెంచుతూ పోతున్న కేంద్రం తాజాగా మరోమారు పెంచింది. 14.2 కేజీల సిలిండర్‌పై బుధవారం రూ.2.94 పెంచింది. ఫలితంగా గ్యాస్ సిలిండర్ ధర రూ. 505.34కు చేరుకుంది. అలాగే, సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ. 60 పెంచింది. ఈ సిలిండర్ ధర రూ. 939కి చేరుకుంది. పెరిగిన ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.

అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు, విదేశీ మారక ద్రవ్యంలో ఒడిదొడుకులు కారణంగానే ధరలు పెంచినట్టు ఐవోసీఎల్ తెలిపింది. కాగా, ఇప్పటి వరకు గ్యాస్ వినియోగదారుల ఖాతాలో ఒక్కో సిలిండర్‌కు రూ.376.60 జమకాగా, ఈ నెల నుంచి రూ.433.66 జమ కానున్నాయి. కాగా, గత ఆరు నెలల్లో ఒక్కో సిలిండర్‌పై రూ.14.15 పెరిగింది.

LPG Cylinder
IOCL
Narendra Modi
Rate hike
  • Loading...

More Telugu News