Danthewada: మావోల మెరుపుదాడిలో గాయపడిన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి

  • చికిత్స పొందుతూ మృతి చెందిన రాకేశ్ కౌశల్
  • ఎన్నికల ప్రక్రియ కవరేజ్‌కి వెళ్లిన దూరదర్శన్ బృందం
  • నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

దంతెవాడలో నిన్న మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో దూరదర్శన్ కెమెరా మ్యాన్‌తో పాటు మరో ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నేడు ఆ మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. నిన్నటి ఘటనలో తీవ్రంగా గాయపడిన పోలీస్  కానిస్టేబుల్ రాకేశ్ కౌశల్ నేడు చికిత్స పొందుతూ మృతి చెందారు.

నీలవాయ గ్రామం సమీపంలోని ఆరాన్‌పూర్ అడవుల్లో నిన్న ఉదయం ఎన్నికల ప్రక్రియను కవర్ చేసేందుకు వెళ్లిన దూరదర్శన్ బృందంపై మావోలు విరుచుకు పడ్డారు. ఘటనపై నక్సల్స్ వ్యతిరేక ప్రత్యేక ఐజీ డీఎం అవస్తి మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకునే ప్రక్రియలో భాగంగా ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోందని వెల్లడించారు.

Danthewada
Mavoists
Rakesh koushal
DM Avasti
Aranpur Forest
  • Loading...

More Telugu News