jagan: జగన్ పై దాడి నిందితుడు శ్రీనివాస్ కు పూర్తి భద్రత కల్పిస్తాం: చినరాజప్ప

  • విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం
  • శ్రీనివాస్ భద్రత విషయంలో అనుమానాలు వద్దు
  • విపక్ష నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు

జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాస్ కు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. విపక్ష నేతలు ఈ అంశంపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, కేసు విచారణలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కేసు విచారణ, శ్రీనివాస్ కు భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని తెలిపారు.

మరోవైపు, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని శ్రీనివాస్ వేడుకున్న సంగతి తెలిసిందే. తనను చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న కేజీహెచ్ కు తరలిస్తున్న సమయంలో మీడియాకు ఈ విషయాన్ని తెలిపాడు. తాను జగన్ అభిమానినని, ఆయన కోసమే ఈ పని చేశానని చెప్పాడు.

jagan
Nimmakayala Chinarajappa
srinivas
  • Loading...

More Telugu News