KTR: కరెంట్ అడిగితే కాల్చి చంపినోళ్లకు ఓట్లేస్తే మళ్లీ చీకటి రోజులే: కేటీఆర్
- కేసీఆర్‌ను దించేందుకు కొట్టుకున్నవాళ్లు ఏకమయ్యారు
- టీఆర్‌ఎస్ ఏర్పడ్డాక బీడీ కార్మికులకు పెన్షన్లు
- ఆలోచించి ఓటేయండి
కరెంట్ అడిగితే కాల్చి చంపినోళ్లకు ఓట్లేస్తే మళ్లీ చీకటి రోజులే వస్తాయని ప్రతిపక్ష నేతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. చనిపోయిన వారి పేర్లతో కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసులు వేశారని విమర్శించారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు 40 ఏళ్లుగా కొట్లాడుకున్నవాళ్లు ఏకమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నడూ లేని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నామని, ఆలోచించి ఓటు వేయాలని, ఆగం ఆగం కావొద్దని ప్రజలను ఆయన కోరారు. గంభీరావుపేట మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.