: నాలుగు స్థానాల్లో పోటీ.. మూడు చోట్ల విజయం!


పాకిస్తాన్ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకెళుతున్న మాజీ క్రికెట్ సారథి ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో సత్తా చాటాడు. మొత్తం నాలుగు స్థానాల నుంచి ఎన్నికల బరిలో దిగిన ఇమ్రాన్ ఖాన్ మూడు చోట్ల విజయఢంకా మోగించాడు. పెషావర్, మయాన్ వాలి, రావల్పిండి నియోజకవర్గాల్లో జయకేతనం ఎగరేసిన ఇమ్రాన్.. లాహోర్లో మాత్రం ఓటమి చవిచూడకతప్పలేదు. కాగా, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ ఎన్నికల్లో 34 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే, మూడు స్థానాల్లో గెలిచిన ఇమ్రాన్ ఏదో ఒక స్థానాన్నే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా రెండింటికి రాజీనామా చేయాల్సిందే.

  • Loading...

More Telugu News