Virat Kohli: అరటి పళ్లు అడిగిన కోహ్లీ.. ఆశ్చర్యపోయిన పాలకుల కమిటీ

  • మా భార్యలను మాతోనే ఉండనివ్వాలి
  • జట్టు కోసం రైల్వే జట్టును రిజర్వ్ చేయాలి
  • తగినన్ని అరటి పండ్లు సరఫరా చేయాలి

హైదరాబాద్‌ టెస్టు తర్వాత క్రికెట్‌ పాలకుల సంఘం, జట్టు మేనేజ్‌మెంట్‌ సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షకు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, వన్డే వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రవిశాస్త్రి, టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సమీక్షలో కోహ్లీ వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ సమయంలో తమకు తగినన్ని అరటి పండ్లు సరఫరా చేయాలని, తమ భార్యలను సిరీస్ మొత్తం తమతోనే ఉండేలా అనుమతించాలని, తమ జట్టు కోసం ఒక రైల్వే కోచ్ రిజర్వ్ చేయాలని కోరినట్టు సమాచారం.

అరటిపండ్ల విషయంలో కోహ్లీ విజ్ఞప్తికి ఆశ్చర్యపోయిన పాలకుల కమిటీ బీసీసీఐ ఖర్చులతో అరటి పండ్లు కొనివ్వాలని టీమిండియా మేనేజర్‌ను అడగాలని సూచించింది. కొందరు ఆటగాళ్లు భార్యలుంటే ఆటపై శ్రద్ధ పెట్టలేరని కాబట్టి ఏకాభిప్రాయం తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. రైలు ప్రయాణాన్ని మాత్రం పాలకుల కమిటీ అంగీకరించలేదు. అయితే కోచ్‌ను పూర్తిగా రిజర్వ్ చేసి బ్లాక్ చేయాలని కోహ్లీ సూచించినట్టు సమాచారం.

Virat Kohli
Rohith Sharma
Ravi sastri
MSK Prasad
World Cup
  • Loading...

More Telugu News