Pratibha Bharati: ఆందోళనకరంగా ప్రతిభా భారతి ఆరోగ్య పరిస్థితి

  • వైద్యానికి సహకరించని శరీరం
  • మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లేదా బెంగళూరు తరలించే అవకాశం
  • భర్త కృష్ణప్రసాద్‌కు స్వల్ప అస్వస్థత

మూడు రోజులుగా విశాఖపట్నంలోని పినాకిల్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. విషమంగా ఉన్న ఆమె ఆరోగ్య పరిస్థితి సోమవారం నాటికి మరింత ఆందోళనకరంగా మారింది. ఆమె శరీరం వైద్యానికి సహకరించడం లేదు. శరీరంలోకి రక్తం ఎక్కడం లేదు. దీంతో వైద్యులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లేదా బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రతిభా భారతి తండ్రి కొత్తపల్లి పున్నయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు.

భార్య, మామయ్య అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతుండడంతో ప్రతిభా భారతి భర్త కావలి కృష్ణప్రసాద్ మొన్నటివరకూ హాస్పిటల్లో ఉన్నారు. అయితే ఆరోజు సాయంత్రం కావలి గ్రామానికి చేరుకున్న ఆయనకు ఘగర్, బీపీ పెరగడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

  • Loading...

More Telugu News