Andhra Pradesh: జగన్ హత్యకు చంద్రబాబు కుట్ర పన్నారు.. వైఎస్సార్ మరణంపై కూడా అనుమానం కలుగుతోంది!: సుధాకర్ బాబు

  • ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కు సిగ్గుండాలి
  • దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలి
  • శివాజీని విచారిస్తే నిజాలు బయటకు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ ను హత్య చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నారని వైసీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు ఆరోపించారు. జగన్ హత్యకు కుటుంబ సభ్యులే ప్రయత్నించారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించడం దారుణమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు సిగ్గుండాలనీ, దమ్ముంటే చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. ఈరోజు వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సుధాకర్ మాట్లాడారు.

ప్రతిపక్ష నేత జగన్ కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకే టీడీపీ హత్యాయత్నం చేయించిందని మండిపడ్డారు. నటుడు శివాజీని విచారిస్తే ఎక్కడ నిజాలు బయటపడతాయో అని చంద్రబాబు భయపడుతున్నాని వ్యాఖ్యానించారు. ఇదంతా చూస్తుంటే మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనుక కూడా ఏదో కుట్ర ఉందని అనుమానం కలుగుతోందన్నారు.

‘ఆపరేషన్ గరుడ’ సృష్టికర్త చంద్రబాబేనని సుధాకర్ స్పష్టం చేశారు. ఈ కుట్రలో చంద్రబాబు ఓ ఎస్సీ యువకుడిని బలిపశువును చేశారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దర్యాప్తు చేయిస్తే అసలు బండారం బయపడుతుందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News