Russia: సర్కస్ ఫీట్లు చేస్తూ, నాలుగేళ్ల బిడ్డను అమాంతం లాగేయబోయిన సింహం... వీడియో!

  • రష్యాలోని క్రాస్ నోడార్ లో ఘటన
  • సింహంతో సర్కస్ ఫీట్లు చేయిస్తున్న ట్రయినర్
  • అమాంతం పాపపై పంజా విసిరిన సింహం
  • తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న పాప

సర్కస్ ఫీట్లు చేస్తున్న ఓ సింహం, ప్రదర్శనను తిలకిస్తున్న నాలుగేళ్ల చిన్నారిని, అమాంతం మింగేయాలని చూసింది. ఆ పాపపై పంజాను విసిరి, తన బోనులోకి లాగాలని ప్రయత్నించగా, సిబ్బంది అప్రమత్తం కావడంతో, పాప తీవ్ర గాయాలతో బయటపడింది. ఈ దృశ్యాల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రష్యాలోని క్రాస్ నోడార్ లో ఓ సింహంతో సర్కస్ చేయిస్తున్న వేళ, ఈ ఘటన జరిగింది. సింహం బోనులోకి వెళ్లిన ట్రయినర్, దానితో ఫీట్లు చేయిస్తుండగా, బోను దగ్గరకు వచ్చిన ఓ పాప, చప్పట్లు కొడుతోంది.

సింహంతో మరో ఫీట్ చేయించే క్రమంలో దాన్ని కూర్చోబెట్టిన ట్రయినర్, ప్రేక్షకులకు ఏదో చెబుతుండగా, ఒక్కసారిగా సింహం లేచి పాపపై పడింది. పాపను బోనులోకి లాక్కొచ్చి తినేందుకు ప్రయత్నించగా, ట్రయినర్, ఇతర సిబ్బంది దాన్ని అదుపు చేశారు. ముఖంపై తీవ్ర గాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారించిన అధికారులు, రక్షణ ఏర్పాట్లు లేకుండా షో నిర్వహించారని తేల్చారు. సర్కస్ డైరెక్టర్ ను తొలగిస్తున్నట్టు తెలిపారు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

Russia
Cross Nodor
Lion
Baby
  • Error fetching data: Network response was not ok

More Telugu News