extra martial affair: అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. మనస్తాపంతో హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య!

  • హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఘటన 
  • వివాహేతర సంబంధం పెట్టుకున్న పావని
  • ప్రియుడి మోజులో పడి భర్తకు వేధింపులు

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తట్టుకోలేకపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణం భార్యేనని సూసైడ్ నోట్ లో స్పష్టంగా రాశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని పంజాగుట్టలో చోటుచేసుకుంది.

పంజాగుట్టలోని ప్రతాప్ నగర్ లో ఉంటున్న ప్రశాంత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పావని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రశాంతంగా సాగుతున్న వీరి కాపురంలోకి ప్రణయ్ అనే యువకుడు ప్రవేశించాడు. అతనితో పావని వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే దీన్ని మానుకోవాలని ప్రశాంత్ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. కానీ పావని ఏమాత్రం మారకపోగా, చనిపోవాలని ప్రశాంత్ ను మాటిమాటికి దూషించేది.

ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి లోనైన ప్రశాంత్ ఫ్లాట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన బంధువులు హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఈ వ్యవహారంపై పావని మాట్లాడుతూ.. తనకు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం ఉన్నట్లు ప్రశాంత్ అనుమానించేవాడని తెలిపింది. రోజూ తనను వేధించేవాడని వెల్లడించింది.

కాగా, ప్రశాంత్ ఆత్మహత్యకు కారణమైన పావనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో పలుమార్లు పెద్దల సమక్షంలో నచ్చజెప్పినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

extra martial affair
Hyderabad
Telangana
suicide
youth
man
softwear engineer
Police
case
prashant
pawani
pranay
  • Loading...

More Telugu News