Reliance: రూ. 149 నుంచి... ఎంత రీచార్జ్ చేస్తే అంత క్యాష్ బ్యాక్: జియో దీపావళి ఆఫర్

  • కూపన్ల రూపంలో క్యాష్ బ్యాక్
  • నవంబర్ 30 వరకూ ఆఫర్
  • డిసెంబర్ 31లోపు వాడుకోవాలంటున్న రిలయన్స్

ఈ దీపావళి పర్వదినం సందర్భంగా రూ. 1,699తో జియో సిమ్ ను రీచార్జ్ చేసుకుంటే, 365 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటాను ఇస్తామని, కాల్స్, రోమింగ్, మెసేజ్ లు ఉచితమని, ఈ మొత్తం డబ్బును రిలయన్స్ కూపన్ల రూపంలో క్యాష్ బ్యాక్ గా ఇస్తామని ఇటీవల ఆఫర్ ఇచ్చిన రిలయన్స్, తాజాగా మరో బంపరాఫర్ ఇచ్చింది. రూ. 149కి పైన ఎంత మొత్తం రీచార్జ్ చేసుకుంటే, అంత మొత్తాన్ని క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తామని తెలిపింది.

నవంబర్ 30 వరకూ ఈ ఆఫర్ లో భాగంగా రీచార్జ్ చేసుకుని, డిసెంబర్ 31లోగా వినియోగించుకోవచ్చని తెలిపింది. రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో రూ. 5 వేలకు మించి వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో ఈ కూపన్లను వాడుకోవచ్చని పేర్కొంది. కాగా, జియో ప్రస్తుతం రూ. 149 నుంచి రూ. 9,999 మధ్య వివిధ రకాల ప్లాన్లను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే.

Reliance
Jio
Cash Back
Digital Coupons
  • Loading...

More Telugu News