Andhrajyothy: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై అసభ్యకర పోస్టింగులు చేసిన ఒంగోలు యువకుడి అరెస్ట్

  • ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు షేర్ చేస్తున్న అబ్దుల్ హఫీజ్
  • కువైట్ నుంచి పంపుతున్న స్నేహితులు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఏబీన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టింగులు చేస్తున్న ఒంగోలు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ అబ్దుల్ ఖుర్దూష్ కుమారుడు అబ్దుల్ హఫీజ్ ఈ నెల 28న ఫేస్‌బుక్‌లో రాధాకృష్ణపై అసభ్యకర పోస్టింగులు షేర్ చేశాడు.

ఆంధ్రజ్యోతి ఒంగోలు బ్రాంచి మేనేజర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అబ్దుల్ హఫీజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు పలు విషయాలను వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. కువైట్‌లో ఉంటున్న కర్నూలుకు చెందిన ఎస్‌కే హనీఫ్, నాజర్, తెలంగాణకు చెందిన దావూద్ పంపిన పోస్టులనే తాను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నానని, అంతకుమించి తనకేమీ తెలియదని పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Andhrajyothy
ABN
Radhakrishna
Facebook
YSRCP
  • Loading...

More Telugu News