Rakul preeth: డ్రెస్ చెత్తగా ఉంది.. నీకంటే బిచ్చగాళ్లే నయం!: రకుల్‌పై నెటిజన్ల ఫైర్

  • చిన్నపిల్లల మనస్తత్వాన్ని అలాగే ఉండనివ్వాలి
  • రకుల్ ఫోటోపై విరుచుకుపడుతున్న నెటిజన్లు
  • రోడ్ సైడ్ డ్రెస్‌లు వేసుకుంటున్నావా? అని ఫైర్

ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతిదీ పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నమే అమ్మడికి బాగా దెబ్బకొట్టింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

‘మనలోని చిన్న పిల్లల మనస్తత్వాన్ని ఎప్పటికీ అలాగే ఉండిపోనివ్వాలి’ అంటూ అమ్మడు అల్ట్రా మోడ్రన్ డ్రెస్‌తో ఫోటో పెట్టింది. దీంతో నెటిజన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. నీ జాకెట్ చాలా చెత్తగా ఉంది అని ఒకరు, బిచ్చగాళ్లే నయం ఇంతకంటే మంచి డ్రెస్సులు వేసుకుంటారని మరొకరు, సినిమా అవకాశాల్లేక, డబ్బుల్లేక రోడ్ పక్కన కొన్న డ్రెస్సులు వేసుకుంటున్నావా? నా దగ్గరకు రా నేను కొనిస్తా అని ఇంకొకరు కామెంట్లు పెడుతున్నారు.

Rakul preeth
Instagram
Modren Dress
NetiZens
  • Loading...

More Telugu News