Nimmakayala Chinarajappa: కేసును పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు కేంద్ర హోమంత్రిని కలిశారు: చిన రాజప్ప

  • కేసుపై అన్నీ కోణాల్లో విచారణ
  • పోలీసుల సహకారం లేకుండా పాదయాత్ర చేశారా
  • వైసీపీ నేతల ఆరోపణలు సబబు కాదు

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి కేసును పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారని ఏపీ హోంమంత్రి చినరాజప్ప ఆరోపించారు. జగన్‌పై దాడి కేసులో ప్రభుత్వం అన్ని కోణాల్లో విచారణ చేస్తోందని వెల్లడించారు. రాష్ట్ర పోలీసుల సహకారం లేకుండానే జగన్ 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారా? అని వైసీపీ నాయకులను ఆయన ప్రశ్నించారు.

జగన్ ఆడుతున్న నాటకం అందరికీ అర్థమైందని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నకిలీ సభ్యత్య నమోదు కార్డు తయారు చేసి తమపై నిందలు వేయడం ఏంటని చినరాజప్ప ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి కావడం కోసమే దాడి చేసినట్లు నిందితుడు చెప్పాడని, ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం సబబుకాదని హితవు పలికారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Nimmakayala Chinarajappa
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News