palaniswamy: పళనిస్వామికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

  • బంధువులకు, అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెట్టారంటూ పళనిపై ఆరోపణలు
  • సీబీఐ విచారణకు ఆదేశించిన మద్రాస్ హైకోర్టు
  • హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అయాచితంగా తన బంధువులకు, అనుచరులకు రోడ్డు కాంట్రాక్టు పనులను కట్టబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ దర్యాప్తుకు మద్రాస్ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. పారదర్శకంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో కేసును విజిలెన్స్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో, హైకోర్టు ఆదేశాలను పళనిస్వామి సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును ఈరోజు విచారించిన సుప్రీంకోర్టు... హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. 

palaniswamy
Supreme Court
Tamilnadu
  • Loading...

More Telugu News