sri chaitanya: కూకట్ పల్లిలో విద్యార్థినిని బలిగొన్న చైతన్య కాలేజీ బస్సు.. బస్సులను ధ్వసం చేసిన విద్యార్థులు.. భారీగా ట్రాఫిక్ జామ్

  • రమ్య అనే ఇంటర్ విద్యార్థినిపై దూసుకెళ్లిన కాలేజీ బస్సు
  • అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన రమ్య
  • ఆందోళనకు దిగిన విద్యార్థులు

హైదరాబాద్ కూకట్ పల్లిలో శ్రీ చైతన్య కాలేజ్ బస్సు బీభత్సం సృష్టించింది. ఇంటర్ చదువుతున్న రమ్య అనే విద్యార్థినిపై నుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కళ్ల ముందే తమ స్నేహితురాలు ప్రాణాలు కోల్పోవడంతో విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. కాలేజీకి చెందిన పలు బస్సులను ధ్వంసం చేశారు. రోడ్డుపై ఆందోళనకు దిగారు. బస్సును రోడ్డు పైనే ఆపేయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

sri chaitanya
college bus
accident
kukatpally
ramya
student
dead
  • Loading...

More Telugu News