Andhra Pradesh: దేశం గురించి తర్వాత ఆలోచిద్దువుగాని.. ముందు నీ పదవి ఊడిపోకుండా చూసుకో!: చంద్రబాబుపై రాంమాధవ్ ఫైర్

  • గుంటూరులో బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ ప్రమాణ స్వీకారం
  • రాష్ట్రంలో గరుడ పురాణ కాలక్షేపం జరుగుతోందన్న రాంమాధవ్
  • కేంద్రం నిధులతో చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారన్న కన్నా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మరోమారు మండిపడ్డారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం గరుడ పురుణ కాలక్షేపం జరుగుతోందన్నారు. బీజేపీ మద్దతు లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం అసాధ్యమన్న ఆయన.. చంద్రబాబు నాయుడు దేశం గురించి ఆలోచించడం మాని తొలుత తన పదవిని కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలని సూచించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కేంద్రం నిధులు ఇస్తుంటే.. చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని  ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు మోదీ భయం పట్టుకుందని, కలలో కూడా మోదీ, మోదీ అని కలవరిస్తున్నారని మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు విజయ రహత్కర్‌ అన్నారు.

Andhra Pradesh
Chandrababu
Ram Madhav
BJP
Kanna
Guntur District
  • Loading...

More Telugu News