Telangana: తెలంగాణలో ఎన్నికల పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేసిన విజయశాంతి!

  • అవసరార్థమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం
  • పరిమితులు నిర్దేశించుకోవాలని ఉత్తమ్ కు చెప్పా
  • హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన నటి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకానికి సంబంధించి చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నటి విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్నికల కోసమే తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందని తెలిపారు. అయితే ఈ పొత్తులో భాగంగా కొన్ని పరిమితులను నిర్దేశించుకున్నామని వెల్లడించారు.

హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీతో కొన్ని అంశాల్లో హద్దులను నిర్దేశించుకుని పనిచేయాల్సిందిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించినట్లు విజయశాంతి తెలిపారు. మహాకూటమిలో సీట్ల పంపకంపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు,ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయిన సందర్భంగా విజయశాంతి ఈ మేరకు స్పందించారు.

Telangana
Congress
Telugudesam
Chandrababu
Uttam Kumar Reddy
vijayasanti
limits
warn
cpi
tjs
  • Loading...

More Telugu News