CBI rides: కాకినాడలో సీబీఐ అధికారులు... సానా సతీష్‌ బాబు అతిథిగృహంలో తనిఖీలు

  • ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ చేరుకున్న తనిఖీ బృందం
  • సీబీఐ అధికారుల మధ్య చిచ్చుకు కీలకంగా మారిన సతీష్‌ వాంగ్మూలం
  • అందుకే ఈ తనిఖీలన్న అభిప్రాయం

సీబీఐ అదనపు డైరెక్టర్‌ రాకేష్‌ అస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా కీలక వాంగ్మూలం ఇచ్చిన హైదరాబాద్‌ వ్యాపారవేత్త సానా సతీష్‌పై సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం సీబీఐ అధికారులు కాకినాడలోని సతీష్‌ అతిథి గృహంతోపాటు, అతని బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు.

ఇందుకోసం ఢిల్లీ నుంచి సీబీఐ ప్రత్యేక బృందం ఈ ఉదయమే కాకినాడలో అడుగుపెట్టింది. తొలుత సతీష్‌ అతిథి గృహంలోను, తర్వాత అతని బంధువుల ఇళ్లలోను సోదాలు జరిపారు. సీబీఐ అధికారుల మద్య చిచ్చుకు సతీష్‌ వాంగ్మూలమే ప్రధాన కారణమైందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

CBI rides
Kakinada
sana satish gesthouse
  • Loading...

More Telugu News