LED tvs in hospitals: బోధనాసుపత్రుల్లో వ్యాధులపై అవగాహన.. ఎల్‌ఈడీ టీవీల ఏర్పాటు

  • రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆలోచన ఇది
  • విజయవాడలో ప్రారంభం..అనంతరం అన్ని ఆస్పత్రులకు విస్తరణ
  • ముందస్తు జాగ్రత్తలపై ప్రధానంగా అవగాహన

‘రోగం వచ్చాక చికిత్స తీసుకునే కంటే ముందస్తు జాగ్రత్తతో చాలా మేలు’...సాధారణంగా వైద్యులు చెప్పే విషయం ఇది. ఈ సూత్రం ఆధారంగానే ప్రజల్లో అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య సంరక్షణ, వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆరోగ్య శాఖ సరికొత్త ఆలోచన చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనాసుపత్రుల్లో ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటుచేసి సీజనల్‌ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటి ఏర్పాటు ద్వారా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎంఈ పరిధిలో ఉన్న 13 బోధనాసుపత్రుల్లో 368 ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటుచేసి రాష్ట్రంలో ప్రబలుతున్న వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. అలాగే బీపీ, షుగర్‌, ఎయిడ్స్‌, కేన్సర్‌పై ప్రత్యేక కార్యక్రమాలను, వైద్యుల ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తారు.

LED tvs in hospitals
seasonal deseases
  • Loading...

More Telugu News