Anchor: సినీ డిస్ట్రిబ్యూటర్‌కు బెదిరింపులు.. బుల్లితెర యాంకర్ రవి అరెస్ట్!

  • బాకీ డబ్బుల కోసం డిస్ట్రిబ్యూటర్‌ను బెదిరించిన రవి
  • ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
  • రవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు

తనను బెదిరించడమే కాకుండా, దాడికి యత్నించాడంటూ సినీ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఇచ్చిన ఫిర్యాదుతో బుల్లితెర నటుడు, యాంకర్ రవిని హైదరాబాద్, ఎస్సార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బాకీ వసూలు కోసం రవి తనను ఫోన్ చేసి బెదిరించాడని, 20 మందితో కలిసి ఇనుపరాడ్లతో తనపై దాడికి ప్రయత్నించాడని సందీప్ అనే సినీ పంపిణీదారుడు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Anchor
Ravi
Telangana
Hyderabad
SR Nagar
Arrest
  • Loading...

More Telugu News