Andhra Pradesh: నేను క్షేమంగానే ఉన్నా.. నన్నెవరూ ఏమీ చేయలేరు: సినీ నటుడు శివాజీ

  • చట్టపరంగా అన్నీ తెలుసుకునే రంగంలోకి
  • గవర్నర్‌కు ఫిర్యాదుపై ఎద్దేవా
  • వ్యవస్థల గురించి తెలియని వారు మన నాయకులు

తాను క్షేమంగానే ఉన్నానని, తననెవరూ ఏమీ చేయలేరని సినీ నటుడు శివాజీ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై ‘ఆపరేషన్ గరుడ’ జరుగుతోందంటూ సంచలనం సృష్టించిన ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న వార్తలపై అమెరికాలో ఉన్న శివాజీ స్పందించారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. చట్టపరంగా అన్ని విషయాలు తెలుసుకునే తాను రంగంలోకి దిగినట్టు చెప్పారు.

విజిల్ బ్లోయర్స్ చట్టం ప్రకారం తను సేఫ్ అని, దీని గురించి తెలియని వారే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా, అన్నీ తెలుసుకున్న తర్వాతే ‘ఆపరేషన్ గరుడ’ గురించి మీడియాకు వెల్లడించినట్టు చెప్పారు. బీజేపీ నేతలు తనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. వీరికి వ్యవస్థల గురించి తెలియదని, దేశం గురించి తెలియదని, మన ఖర్మకు వీళ్లు నాయకులని శివాజీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Actor
Shivaji
Operation Garuda
BJP
Telugudesam
  • Loading...

More Telugu News