Bin Laden: ఏపీ పోలీసులపై నమ్మకం లేదు.. తాలిబన్ పోలీసులపైనే నమ్మకం.. బిన్ లాడెనే కావాలి: జేసీ సెటైర్లు

  • ఈ దేశంలోనే నమ్మకం లేదు 
  • తాలిబన్ పోలీసులపైనే నమ్మకం
  • తాలిబన్లు అయితేనే మాకు సరిపోతారు

వైసీపీ అధినేత జగన్‌పై దాడి ఘటనలో జగన్ నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి పోలీసు అధికారులు ప్రయత్నించగా ఆయన నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆఫ్ఘనిస్తాన్ పోలీసులనైతే జగన్ నమ్ముతారని సెటైర్లు వేశారు. ఢిల్లీలో ఆయన చంద్రబాబు పర్యటన విషయమై ఓ ఛానల్‌తో మాట్లాడారు.

ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యలపై స్పందించిన జేసీ ‘‘మాకంతా ఆఫ్ఘన్ పోలీసులపైనే నమ్మకం. ఇక్కడ లేదు మాకు నమ్మకం. నాకు ఈ దేశంలోనే నమ్మకం లేదు. ఆఫ్ఘనిస్తాన్ అయితే నమ్మకం ఉంటుంది, అంతే. బిన్ లాడెనే కావాలి మాకు. తాలిబన్ పోలీసులపైనే నమ్మకం. మాకు ఎవ్వరిపైనా నమ్మకం లేదు, అంతే. జగన్ కేసును డీల్ చేయడానికి అసలు కేసనేది అక్కడ ఉందా? తాలిబన్ వాడు వస్తే చెప్తాం.. కేసు ఉందా? లేదా? అనేది. బ్రహ్మాండంగా ఇన్వెస్టిగేట్ చేయగలిగిన వాళ్లు తాలిబన్లు. వాళ్లైతేనే మాకు సరిపోతారు’ అంటూ జగన్ తీరుపై జేసీ సెటైర్లు వేశారు.

Bin Laden
JC Divakar Reddy
Jagan
AP Police
Afghanisthan
  • Loading...

More Telugu News