chiranjevi: శేఖర్ మాస్టర్ కి తేల్చి చెప్పిన మెగాస్టార్!

  • షూటింగు దశలో 'సైరా '
  • శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ 
  • సాయిమాధవ్ బుర్రా సంభాషణలు

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితచరిత్రగా 'సైరా' సినిమా రూపొందుతోంది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా నయనతార, ముఖ్యమైన పాత్రలో తమన్నా కనిపించనున్నారు. ఇది పోరాట ఉద్యమానికి సంబంధించిన కథ కావడంతో, చిరంజీవి నుంచి అభిమానులు ఆశించే డాన్సులు ఉంటాయా అనే సందేహం చాలామందిలో వుంది.

కథా నేపథ్యానికి తగినట్టుగానే డాన్సులు ఉంటాయనీ .. అభిమానులు నిరాశ చెందవలసిన అవసరం లేదనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవిపై చిత్రీకరించే పాటలకు శేఖర్ మాస్టర్ డాన్సులు కంపోజ్ చేశాడట. అయితే ఇంకా కొత్తగా ఉండేలా చూడమని చిరంజీవి సూచించినట్టుగా చెబుతున్నారు. దాంతో శేఖర్ మాస్టర్ కొత్తగా అనిపించే స్టెప్స్ ను డిజైన్ చేయడానికి గట్టి కసరత్తునే చేస్తున్నాడని అంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు హైలైట్ గా నిలవనున్నాయని చెప్పుకుంటున్నారు.   

chiranjevi
nayanatara
  • Loading...

More Telugu News