Vijayawada: విజయవాడలో ఆఫీసుకు వెళ్లి తిరిగిరాని యువతి... ఎండీ ఏదో చేశాడంటున్న తల్లిదండ్రులు!

  • ఏజే టెక్నో కంపెనీలో పనిచేస్తున్న రేచల్
  • ఆఫీసుకు వెళ్లి ఇంటికి రాకపోవడంతో ఫిర్యాదు
  • ఎండీ విజయ్ కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు

ఆఫీసుకని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి, తిరిగి రాని ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె ఎక్కడ ఉందన్న విషయమై ఆరా తీస్తున్నారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, బందెల రేచల్ (22) అనే యువతి ఏజే టెక్నో కంపెనీలో పనిచేస్తోంది. నిన్న ఆఫీసుకని వెళ్లిన రేచల్, రాత్రయినా తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. సంస్థ ఎండీ విజయ్ తమ బిడ్డను కిడ్నాప్ చేసుంటాడని, ఆమె ప్రాణాలతో ఉందా? లేదా? అన్న భయం తమలో నెలకొనివుందని తెలిపారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పటమట పోలీసులు, ఆఫీసు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. రేచల్ సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. 

Vijayawada
Rechal
AJ Techno
Kidnap
Missing
Police
  • Loading...

More Telugu News