Andhra Pradesh: వైఎస్ జగన్ పై హత్యాయత్నం.. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు!

  • గిడ్ల చైతన్య, విజయలక్ష్మి కస్టడీలోకి
  • మరింత లోతుగా విచారిస్తున్న అధికారులు
  • విశాఖకు తరలించిన సిట్ బృందం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు స్నేహితుడు గిడ్ల చైతన్య, లేఖ రాయడానికి సాయం చేసిన విజయలక్ష్మిలను నిన్న రాత్రి ముమ్మడివరం పోలీస్ స్టేషన్ నుంచి విశాఖకు తీసుకొచ్చారు.

జగన్, శ్రీనివాసరావులు ఉన్న ప్లెక్సీల ఏర్పాటులో చైతన్య కీలక పాత్ర పోషించారు. తాజాగా శ్రీనివాసరావు జగన్ హత్యకు కుట్ర పన్నినట్లు వీరికి ముందుగానే తెలుసా? ఎన్నిరోజులు ప్లాన్ చేశారు? ఇంకా ఎవరెవరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు? అనే కోణంలో అధికారులు నిందితులను విచారించనున్నారు.

Andhra Pradesh
attack
Jagan
YSRCP
Visakhapatnam District
airport
SIT
Police
TWO
arrested
custody
murder
plan
enquiry
investgation
  • Loading...

More Telugu News