Gold: మొబైల్ ఫ్లిప్‌కవర్‌లో రూ.87 లక్షల బంగారం.. ప్రయాణికుడి అరెస్ట్

  • మొబైల్ ఫ్లిప్‌కవర్‌లో 2997 గ్రాముల బంగారం
  • కస్టమ్స్ అధికారులకు చిక్కిన నిందితుడు
  • పట్టుబడిన బంగారం విలువ రూ.87 లక్షలు

ఆలోచించి చూడాలే కానీ స్మగ్లింగ్‌కు అడ్డదారులు చాలానే ఉంటాయని జితేంద్ర సోలంకి అనే వ్యక్తి నిరూపించాడు. బంగారాన్ని అక్రమంగా తరలించబోయి అడ్డంగా బుక్కయ్యాడు. స్మార్ట్‌ఫోన్ మొబైల్ ఫ్లిప్‌కవర్లలో ఏకంగా 2997 గ్రాముల బంగారం బిస్కెట్లను దాచి సెల్‌ఫోన్‌గా కలరింగ్ ఇవ్వబోయాడు. అయితే, అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయడంతో అడ్డంగా దొరికిపోయాడు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. జితేంద్ర నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.87,51,210 ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Gold
Mumbai
Jitendra Solanki
gold bars
CSI Airport
  • Loading...

More Telugu News