ys rajasekhar reddy: వైఎస్ మొదలుపెట్టిన హత్యా రాజకీయాలనే జగన్ ఫాలో అవుతున్నారు!: కొనకళ్ల నారాయణ

  • ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలనుకున్నారు
  • శాంతిభద్రతల సమస్య తెచ్చేందుకు ప్లాన్ చేశారు
  • రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర పన్నారు

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసే కుట్ర జరుగుతోందని టీడీపీ పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణ ఆరోపించారు. ఇందులో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. జగన్ పై హత్యాయత్నం సాకుగా చూపి రాష్ట్రంలో అల్లర్లు  సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని నారాయణ వెల్లడించారు. అయితే ఈ కుట్రలను ప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టగలిగిందన్నారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో నారాయణ మాట్లాడారు.

ఈ దాడి స్వయంగా జగన్ తనపై తాను చేసుకున్న హత్యాయత్నమేనని కొనకళ్ల నారాయణ స్పష్టం చేశారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్ లో మత కల్లోలాలు సృష్టించి అధికారంలోకి వచ్చేందుకు యత్నించారని ఆయన తెలిపారు. ఇప్పుడు జగన్ ది కూడా అదే వారసత్వమని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ నేతలు, ప్రముఖులు లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.

ఓవైపు చంద్రబాబు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తూ ఉంటే, మరోవైపు కేంద్రం ఐటీ దాడులతో పారిశ్రామికవేత్తలను బెదరగొడుతోందని మండిపడ్డారు. కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రం కోసం కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఏపీలో శాంతిభద్రతలు లేవన్న సాకుతో రాష్ట్రపతి పాలన పెట్టేందుకు కుట్ర జరిగిందన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News