Anantapur District: అలా ఎలా జరిగిందబ్బా?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో!

  • అనంతపురం కలెక్టరేట్ ఎదుట వ్యక్తిపై నుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్
  • బాధితుడికి చిన్న గాయం కూడా కాని వైనం
  • తాజాగా బయటపడి వైరల్

అనంతపురం కలెక్టరేట్ ఎదుట జరిగిన ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జూన్ 15న మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. కలెక్టరేట్ ఎదురుగా ఓ ప్రయాణికుడు నిల్చున్నాడు. అంతలో ఓ ట్రాక్టర్ వేగంగా దూసుకొచ్చింది. అతడు తేరుకునేలోపే అతడిపై నుంచి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించినా ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం ఆపకుండా ముందుకు వెళ్లాడు. సరిగ్గా అప్పుడే అద్భుతం జరిగింది.

ట్రాక్టర్ కాస్తా ముందుకు వెళ్లగానే ఆ వ్యక్తి నిదానంగా లేచి దులుపుకుని ట్రాక్టర్ డ్రైవర్‌ను కేకేసి గొడవకు దిగాడు. ట్రాక్టర్ పై నుంచి వెళ్లినప్పటికీ చిన్నగాయం కూడా కాకుండా బయటపడిన అతడిని చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోయారు. పోలీసులు ఇటీవల ఇక్కడి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదని  పోలీసులు తెలిపారు. కాగా, ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అతడి అదృష్టానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Anantapur District
Collectorate
Viral Videos
Andhra Pradesh
  • Loading...

More Telugu News