Lanka Dinakar: మొత్తం కుట్ర వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరిగిందా? : లంక దినకర్

  • దాడి తర్వాత జగన్ హైదరాబాద్ వెళ్లడంపై అనుమానాలు
  • విశాఖ ఆస్పత్రికి తరలించకుండా రాజకీయాలు
  • కత్తికి విషం ఉందని వైసీపీ రెచ్చగొట్టేప్రయత్నం

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో గురువారం జరిగిన దాడిపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మొత్తం కుట్ర వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరిగిందా? అనే అనుమానం కలుగుతోందని, దాడి తర్వాత జగన్ హైదరాబాద్ వెళ్లడంపై పలు అనుమానాలున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర్ అన్నారు. జగన్‌ను ఎలా హైదరాబాద్‌కు పంపించారని వైసీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. విశాఖ ఆస్పత్రికి తరలించకుండా రాజకీయాలు చేశారని, కత్తికి విషం ఉందని నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.

Lanka Dinakar
Telugudesam
  • Loading...

More Telugu News