Andhra Pradesh: తండ్రి చితికి నిప్పు పెట్టకముందే జగన్ సీఎం పీఠంపై కన్నేశాడు.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనుకున్నాడు!: మంత్రి నారా లోకేశ్

  • వైఎస్ జగన్ కొత్త డ్రామాలకు తెరలేపాడు
  • ఫిన్ టెక్ సదస్సు సందర్భంగా అలజడికి కుట్ర
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన ఐటీ శాఖ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై నిన్న జరిగిన దాడిపై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠంపై జగన్ కన్నేశాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఈ తరహా డ్రామాలకు తెరలేపడంలో ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం ఎన్ని కుయుక్తులు పన్నినా చివరికి సత్యమే గెలుస్తుందని చెప్పారు. ఈ రోజు ట్విట్టర్ ద్వారా లోకేశ్ జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ప్రతిపక్ష నేత జగన్ ‘కోడి కత్తి డ్రామా’కు తెరలేపారని లోకేశ్ ఆరోపించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ కు కొత్త కాదన్నారు. ఈ దాడి వెనుక వైసీపీ నేతలే ఉన్నారనీ, అది బయటపడ్డా ప్రజలను మోసం చేసేందుకు ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

‘వైజాగ్ లో జరుగుతున్న ఫిన్ టెక్  సదస్సును భగ్నం చేయడం, అటు ప్రజల సానుభూతిని పొందడం - ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని జగన్ అనుకున్నాడు. ఏ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరుగుతున్నా అదే సమయంలో ఏదో ఒక అలజడి సృష్టించాలని చూస్తున్నారు. కానీ జగన్ నాటకానికి ఏ ప్రయోజనమూ దక్కలేదు’ అని జగన్నాటకం అన్న హ్యాగ్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Telangana
Hyderabad
Jagan
attack
murder
kill
Nara Lokesh
Chandrababu
ysr
  • Loading...

More Telugu News