chiranjeevi: చిరూతో కొరటాల సినిమా మొదలయ్యేది అప్పుడేనట!

  • 'సైరా' షూటింగులో చిరంజీవి బిజీ 
  • తదుపరి సినిమా కొరటాలతో 
  • సిద్ధమవుతోన్న పూర్తిస్థాయి స్క్రిప్ట్

ప్రస్తుతం చిరంజీవి 'సైరా' సినిమా షూటింగులో బిజీగా వున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన కొరటాలతో చేయనున్నారు. అందుకు సంబంధించిన పనుల్లోనే కొరటాల వున్నాడు. ఈ సినిమాను డిసెంబర్లో లాంచ్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అది కాస్త వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి తరువాత ఈ సినిమాను లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారనేది తాజా సమాచారం.కొరటాల పూర్తి స్క్రిప్ట్ ను ఇంకా చిరంజీవికి వినిపించకపోవడమే ఈ ఆలస్యానికి కారణమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. త్వరలోనే ఆయన చిరంజీవిని కలిసి పూర్తి స్క్రిప్ట్ ను వినిపిస్తాడట. చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం .. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. వినోదమే ప్రధానమైనప్పటికీ , కొరటాల స్టైల్లో ఈ సినిమాలోనూ సందేశం ఉంటుందని అంటున్నారు. ఇక కథానాయికగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో చూడాలి.   

  • Loading...

More Telugu News