ntr: చిరూ రికార్డుకి దగ్గరలో 'అరవింద'

  • దసరా కానుకగా వచ్చిన 'అరవింద'
  • అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ 
  • రెండు వారాల్లో 158 కోట్ల గ్రాస్    

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అరవింద సమేత'కు కాసుల వర్షం కురిసింది. అటు త్రివిక్రమ్ కెరియర్లోను .. ఇటు ఎన్టీఆర్ కెరియర్లోను ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. 2 వారాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా 150 కోట్ల మార్క్ ను దాటేసింది. తెలుగులో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు తీస్తోంది.

టాలీవుడ్లో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాల్లో .. 164 కోట్ల గ్రాస్ తో 5వ స్థానంలో 'ఖైదీ నెంబర్ 150' వుంది. ఇంతవరకూ 158 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన 'అరవింద' 5వ స్థానానికి చేరువలో వుంది. ఇంకా 6 కోట్లకి పైగా వసూళ్లు వస్తే ఆ రికార్డును అధిగమించడం జరుగుతుందని అంటున్నారు. అందుకు మరో వారం రోజులు పట్టొచ్చని చెబుతున్నారు. ఎన్టీఆర్ కెరియర్లోనే 'అరవింద' టాప్ గ్రాసర్ గా నిలవడం, 150 కోట్లు రాబట్టిన ఆయన తొలి చిత్రం ఇదే కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.   

  • Loading...

More Telugu News