Harish Rao: మహాకూటమి అధికారంలోకి వస్తే.. టీడీపీ ఈ మంత్రి పదవులు తీసుకోవాలనుకుంటోంది: హరీష్ రావు

  • హోంశాఖ, ఇరిగేషన్ శాఖలను తీసుకోవాలనుకుంటోంది
  • హోంశాఖను తీసుకొని ఓటుకు నోటు కేసు నుంచి బయట పడాలనుకుంటున్నారు
  • ఇరిగేషన్ శాఖను తీసుకొని ఆంధ్రకు నీళ్లు తీసుకుపోవాలనుకుంటున్నారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పల్లకి మోయడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఆంధ్ర పార్టీ అయిన టీడీపీని తెలంగాణ పొలిమేరల్లోకి తరిమికొడితే... ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని, మళ్లీ తెలంగాణలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని అన్నారు. మహాకూటమి గెలిస్తే టీడీపీకి హోంశాఖ, ఇరిగేషన్ శాఖలు కావాలట అని చెప్పారు.

హోంశాఖను తీసుకొని ఓటుకు నోటు కేసు నుంచి బయటపడాలని చంద్రబాబు అనుకుంటున్నారని... అదే విధంగా ఇరిగేషన్ శాఖను తీసుకొని ఆంధ్రకు నీళ్లు తీసుకుపోవాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పారు. కొడంగల్ కు చెందిన కొందరు నేతలు హరీష్ సమక్షంలో ఈరోజు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. 

Harish Rao
Chandrababu
congress
Telugudesam
TRS
maha kutami
  • Loading...

More Telugu News