: ఆ నిర్ణయం సోనియా, ప్రధాని కలిసే తీసుకున్నారు: కాంగ్రెస్
పీకే బన్సల్, అశ్వినీ కుమార్ లను మంత్రి పదవుల నుంచి తొలగించడం వెనుక సోనియా ఒత్తిడి పనిచేసిందన్న ఆరోపణలను కాంగ్రెస్ వర్గాలు తోసిపుచ్చాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరిని తొలగించాలన్నది సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్ ల సంయుక్త నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జనార్థన్ ద్వివేది స్పష్టం చేశారు. మన్మోహన్ ను భేఖాతరు చేస్తూ సోనియా ఒక్కతే ఈ నిర్ణయం తీసుకున్నారనడం మీడియా సృష్టే అని ద్వివేది పేర్కొన్నారు.
బన్సల్, అశ్వినీ కుమార్ ఇద్దరూ ప్రధానికి సన్నిహితులైనందునే సోనియా వారిపై వేటు వేశారని మీడియాలో కథనాలొచ్చాయి. ఈ కళంకితులిద్దరినీ ప్రధానే స్వయంగా క్యాబినెట్ లోకి ఎంపిక చేసుకోవడం ఈ కథనాలకు బలం చేకూర్చే అంశం.