shahid: హిందీలో 'కబీర్ సింగ్' గా మారిన 'అర్జున్ రెడ్డి'

  • తెలుగులో హిట్ కొట్టిన 'అర్జున్ రెడ్డి'
  • తమిళంలో 'వర్మ'గా తెరపైకి 
  • మొదలైన హిందీ మూవీ షూటింగ్

తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 'అర్జున్ రెడ్డి' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ప్రేమకథా చిత్రాల్లో ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించింది. దాంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే తమిళంలో ఈ సినిమా ధృవ్ హీరోగా 'వర్మ' పేరుతో నిర్మితమైంది.

ఇక హిందీలోను 'అర్జున్ రెడ్డి'ని రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా చేస్తోన్న ఈ సినిమాకి సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి 'కబీర్ సింగ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. పంజాబ్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. త్వరలో ఢిల్లీలోను షూటింగును జరపనున్నారు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, తెలుగులో కంటే ఎక్కువగా ముద్దు సీన్లు ఉండనున్నాయనే టాక్ వినిపిస్తోంది. హిందీలోనూ ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.       

  • Loading...

More Telugu News