vijay: రికార్డు స్థాయిలో 'సర్కార్' ప్రీ రిలీజ్ బిజినెస్

  • మురుగదాస్ దర్శకత్వంలో 'సర్కార్'
  • అనూహ్యమైన స్థాయిలో అంచనాలు 
  • నవంబర్ 6వ తేదీన సినిమా విడుదల

మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ కథానాయకుడిగా 'సర్కార్' చిత్రం నిర్మితమైంది. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఫస్టులుక్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇక టీజర్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

 ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిందని చెబుతున్నారు. తమిళనాడులో ఈ సినిమా 83 కోట్లకి అమ్ముడు కావడం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఈ సినిమాపై అక్కడ గల క్రేజ్ కు ఈ రేటు అద్దం పడుతోంది. మురుగదాస్ ఇమేజ్ .. ఆయన కథాకథనాలపై గల నమ్మకం .. విజయ్ క్రేజ్ ఇందుకు కారణమని చెప్పుకుంటున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను నవంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు.     

  • Loading...

More Telugu News