Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. కత్తితో పొడుచుకున్న ప్రేమ జంట!

  • నిమ్స్ మే లో శిక్షణ పొందుతున్న జంట
  • దసరా సందర్భంగా స్వగ్రామాలకు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ఓ ప్రేమ జంట దారుణానికి తెగబడింది. కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో చోటుచేసుకుంది. నిర్మల్‌ జిల్లా భైంసా మండలం చుచుందు గ్రామానికి చెందిన జి.గణేశ్(20), జి.శిల్ప(18)లు యూసుఫ్‌గూడలో ఉంటూ అక్కడే ఉన్న నిమ్స్‌మేలో శిక్షణ పొందుతున్నారు.వీరిద్దరూ చాలాకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. శిక్షణ సందర్భంగా సమీపంలోని హాస్టళ్లలో ఉంటున్నారు.

ఇటీవల దసరా పండుగ సందర్భంగా ఇద్దరూ ఊర్లకు వెళ్లివచ్చారు. ఈ నేపథ్యంలో హాస్టల్ సమీపంలో కొందరితో గొడవపడ్డ గణేశ్ తన వద్ద ఉన్న కత్తితో పొడుచుకున్నాడు. అక్కడే ఉన్న శిల్ప సైతం అదే కత్తితో పొడుచుకుంది. వీరి ఆర్తనాదాలు విన్న స్థానికులు, విద్యార్థులు వీరిద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు, ఇద్దరినీ కాపాడారు. నిమ్స్‌మే ప్రతినిధి అంకిత్‌ భట్నాగర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
Telangana
suicide
couple
Police
Nirmal District
knife
  • Loading...

More Telugu News