ys jagan: జగన్ పై దాడి జరిగిన తీరు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి!: సీఎం చంద్రబాబు

  • జగన్ పై దాడి జరిగింది ఎయిర్ పోర్ట్ లో
  • ఇది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది
  • దీనికి సెక్యూరిటీ సీఐఎస్ఎఫ్ ది

సీబీఐ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి నాటకాలు ఆడిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాఫెల్ కుంభకోణం నుంచి తప్పించుకోవడం కోసం సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను తప్పించి, తాత్కాలిక డైరెక్టర్ ని నియమించారని అన్నారు. ఈ విషయాలను తాను చాలా గట్టిగా ప్రతిఘటించానని చెప్పారు. ఏపీలో విపరీతంగా ఐటీ దాడులు చేసే పరిస్థితికి వచ్చారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారని అన్నారు.

జగన్ పై దాడి ఘటనను ఖండిస్తున్నానని, అయితే, దాడి జరిగిన తీరు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. జగన్ పై దాడి జరిగింది ఎయిర్ పోర్ట్ లో అని, ఇది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుందని, దీనికి సెక్యూరిటీ సీఐఎస్ఎఫ్ ది అని అన్నారు. సంఘటన జరిగిన తర్వాత స్థానిక పోలీసులకు సీఐఎస్ఎఫ్ ఫిర్యాదు చేయాలని, అదే సమయంలో బాధితుడు, నిందితుడు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.ఈ సంఘటన జరిగిన తర్వాత బాధ్యతగా వ్యవహరించాల్సిందిపోయి జగన్ నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారని విమర్శించారు.

ఈ సంఘటన అనంతరం గవర్నర్ నేరుగా డీజీపీకి ఫోన్ చేయడం, ఆ తర్వాత ఈ దాడి ఘటనను సీఎం కేసీఆర్, కేటీఆర్, పవన్ కల్యాణ్ ఖండించడం.. ఇవన్నీ చూస్తుంటే ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలై పోయిందని విమర్శించారు. సీబీఐ, ఈడీ వంటి అత్యున్నత సంస్థలు దేశంలో ఎప్పుడైనా ఇలా దుర్వినియోగమయ్యాయా? అని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News