Facebook: ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించిన బ్రిటన్

  • వ్యక్తిగత సమాచారాన్ని అందించిన ఫేస్‌బుక్
  • బ్రిటన్‌ సమాచార కమిషనర్‌ దర్యాప్తులో వెల్లడి
  • ఐదు లక్షల పౌండ్ల జరిమానా

కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణం బహిర్గతం కాగానే ప్రపంచమంతా నివ్వెరపోయింది. నెటిజన్ల నుంచి ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ప్రజల అనుమతితో పనిలేకుండా ఫేస్‌బుక్‌ 2007 నుంచి 2014 వరకు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా, ఇతర యాప్‌ డెవలపర్లకు అందించిందని బ్రిటన్‌ సమాచార కమిషనర్‌ దర్యాప్తులో తేలింది.

దీంతో ఫేస్‌బుక్‌కు బ్రిటన్ భారీ జరిమానా విధించింది. రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే కేంబ్రిడ్జ్ అనలిటికాకు ఫేస్‌బుక్ తన వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అందించిన కారణంగానే ఈ భారీ జరిమానాను విధించింది. చట్టంలోని గరిష్ట పరిమితి మేరకు ఐదు లక్షల పౌండ్లు, డాలర్లలో చెప్పాలంటే.. 6.44 లక్షల డాలర్ల జరిమానా విధించింది.

Facebook
Cambridge Analitica
Netizens
Britain
  • Loading...

More Telugu News