Jagan: జగన్ అంటే ప్రత్యేకమైన అభిమానం.. ఇలా ఎందుకు చేశాడో తెలియట్లేదు: శ్రీనివాస్ తల్లిదండ్రులు

  • ఆరుగురు సంతానం.. చివరివాడు శ్రీనివాస్
  • కుటుంబం మొత్తానికి జగన్ అంటే అభిమానం
  • వైసీపీకి సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాడు

తమ కుటుంబం మొత్తానికి వైసీపీ అధినేత జగన్ అంటే ఎంతో అభిమానమని, అయితే తమ కొడుకు ఎందుకు అలా చేశాడో తెలియదని వైసీపీ అధినేత జగన్‌పై దాడికి పాల్పడ్డ శ్రీనివాస్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. నేటి సాయంత్రం మీడియాతో శ్రీనివాస్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమకు ఆరుగురు సంతానమని అందులో శ్రీనివాస్ చిన్నవాడని తెలిపారు. అతనికి జగన్ అంటే ప్రత్యేకమైన అభిమానమని, వైసీపీకి సంబంధించి ఏ కార్యక్రమమైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాడన్నారు. విశాఖపట్టణంలో పని చేస్తున్నాడని, ఇలా ఎందుకు చేశాడో తమకు అర్థం కావట్లేదని విలపించారు.

Jagan
Srinivas
Parents
YSRCP
vishakapatnam
  • Loading...

More Telugu News